AP: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తుల రద్దీ భారీగా ఉంది. అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 69,270 మంది దర్శించుకున్నారు. 33,180 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.69 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.