పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా కేధరీశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ నోడల్ అధికారిణి కల్పన ఆయనకు పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలుర కళాశాల ప్రిన్సిపల్ రవీందర్ రెడ్డి, శరత్, ఆంజనేయ రావు, సత్యనారాయణ, రఘు నందన్, నరహరి, సంతోశ్ రెడ్డి, కుమార స్వామి పాల్గొన్నారు.