తమ జట్టు నాకౌట్ రేసు నుంచి వైదొలగడంతో తీవ్ర భావోద్వేగానికి గురై ఏడ్చేసిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ‘అతడు ఇంకా చిన్నపిల్లాడే.. మైదానంలో ఆ కుర్రాడిని అలా కన్నీళ్లతో చూస్తుంటే చాలా బాధగా అనిపించింది’ అని అశ్విన్ పేర్కొన్నాడు. అంత చిన్న వయసులో ఒత్తిడిని తట్టుకోలేక వైభవ్ ఎమోషనల్ అయిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.