WNP: గోపాల్ పేట మండల కేంద్రానికి చెందిన వల్లేపు శ్రీలత ఇటీవలే తన ఖరీదైన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై శశిధర్ ఆదేశాల మేరకు సిబ్బంది సీఈఐఆర్ (CEIR) సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆ ఫోన్‌ను రికవరీ చేశారు. శనివారం బాధితురాలిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కానిస్టేబుల్ పరంధాములు చేతుల మీదుగా మొబైల్‌ను అందజేశారు.