TG: బీఆర్ఎస్ భవన్ వద్ద తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను ఏ క్షణమైనా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. భవన్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన పోలీసులను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సుమన్‌ను విచారించేందుకే వచ్చామని, దాని ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయని ఏసీపీ ప్రవీణ్ స్పష్టం చేశారు.