SRCL: ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు మెరుగైన విద్యాబోధన చేయాలని, రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ సూచించారు. చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను మంగళవారం జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును పరిశీలించారు. మధ్యాహ్న భోజనం పరిశీలించారు.