AP: గత ప్రభుత్వ హయాంలో దుర్మార్గపు పాలన సాగిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ‘YCP హయాంలో శాంతి భద్రతలను పట్టించుకోలేదు. అందుకే ప్రజలు వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారు. మా ప్రభుత్వం వచ్చాక శాంతిభద్రతలను పటిష్టం చేస్తున్నాం. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అన్ని రంగాల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం. విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నాం’ అని పేర్కొన్నారు.