PPM: గరుగుబిల్లి మండలం సుంకి సమీపంలో గురువారం రాత్రి ఏనుగుల గుంపు సంచరించినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. రాత్రి సమయంలో ఆ ప్రాంతంలో వెళ్లే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పొలాల వైపు వెళ్లకుండా, ఏనుగులను ప్రేరేపించే విధంగా ప్రవర్తించకూడదని సూచించారు. ఏనుగుల కదలికలను ఎలిఫెంట్ ట్రాకింగ్ బృందం పర్యవేక్షిస్తున్నదని, ప్రజలు సహకరించాలని కోరారు.