అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. పెయిడ్ ప్రివ్యూలతోనే రూ. 3.50 కోట్లు రాబట్టిన ఈ చిత్రం, 5 రోజుల్లో దేశీయంగా రూ. 72.75 కోట్ల నెట్ (రూ. 86.62 కోట్ల గ్రాస్) వసూలు చేసింది. ఓవర్సీస్లో 3 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటడంతో, ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 118 కోట్ల గ్రాస్ నమోదైంది. ఇదే జోరుతో త్వరలోనే రూ. 150 కోట్ల క్లబ్లో చేరడం ఖాయం.