HNK: నగరంలోని జూ పార్క్ లో బుధవారం ‘వరల్డ్ ఎర్త్ డే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జూ పార్క్ ఆవరణలో అసిస్టెంట్ క్యూరేటర్ మయూరి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పలువురు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని అధికారులు తెలిపారు.