SKLM: కవిటి మండలం ఆర్.బెలగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైబర్ నేరాలపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సోంపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఎస్సై బైరాగి ఆన్లైన్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం పంచుకోవద్దని హెచ్చరించారు.