SRCL: జిల్లాలో త్వరగా పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పించేందుకు టీజీఐపాస్ కింద వచ్చిన దరఖాస్తులను నిర్దేశిత సమయంలో జారీ చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశాన్నికలెక్టరేట్లో బుధవారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ నిర్వహించి పరిశ్రమల స్థాపనపై సమావేశాన్ని నిర్వహించారు.