KRNL: తుగ్గలి గ్రామీణ పట్టణ ప్రాంతాలలో వ్యాపారం చేస్తున్న వ్యాపారవేత్తలు రైతులు పండించిన పంటలు కొనుగోలు చేసే సమయంలో తూకాలలో, కొలతలలో తేడాలు చేస్తే చర్యలు తప్పవని ఆదోని డివిజన్ తునికి, కొలతల ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు అన్నారు. బుధవారం దస్తగిరికు చెందిన ఎస్ఎస్ ట్రేడర్ షాప్లో ఆయన తూకాలు వేసే ఎలక్ట్రికల్ కాటా మిషన్లను తనిఖీ చేశారు.