NLG: అంతర్జాతీయ మాతృభూమి దినోత్సవం సందర్భంగా ఇవాళ నల్గొండలో నిర్వహించిన సైకిల్ ర్యాలీని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ప్రారంభించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ముప్పు తప్పదని, కాటన్ సంచులు, స్టీల్ బాటిల్స్ వాడాలని సూచించారు. ప్రజాపాలనలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ప్రకృతిని కాపాడాలని ఆయన కోరారు.