NLR: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డిని బుధవారం పులివెందులలోని వారి నివాసంలో కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న విషయాలు, పలు రాజకీయ అంశాలను చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు వీరి చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.