TPT: పిచ్చాటూరు(మం) పరిధిలోని మోడల్ ప్రాథమిక పాఠశాల, సిద్దిరాజు కండ్రిగలో ధరిత్రీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల ఎంఈవో శ్రీమతి హేమమాలిని పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. భూమిని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె నొక్కి చెప్పారు.