WGL: వరంగల్-1 టీజీఎస్ఆర్టిసి డిపోలో తాత్కాలిక కండక్టర్ల నియామకానికి ప్రకటన వెలువడింది. అభ్యర్థులు కనీసం పదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఆసక్తి గల వారు తమ అసలు సర్టిఫికెట్లతో డిపోకు హాజరై పరిశీలన అనంతరం విధులకు నియమించబడతారు. ఎంపికైన వారికి రోజుకు రూ.800 పారితోషికం చెల్లించబడుతుందని డిపో మేనేజర్ తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.