KRNL: హోళగుంద మండలం మార్లమడికి గ్రామంలో బుధవారం నిర్వహించిన ఊరు దేవర కార్యక్రమంలో ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ సుంకులమ్మ అవ్వ దేవాలయానికి రూ. 20,000 విరాళం అందజేశారు. గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యేకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.