TG: మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని కోర్టు తెలిపింది. ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని పేర్కొంది. వారితో పాటు IPSలు స్మితా సబర్వాల్, SK జోషికి కూడా ఉపశమనం కలిగింది. కాగా, కాళేశ్వరం అవకతవకలపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై KCR, హరీష్ రావు కోర్టును ఆశ్రయించారు.