SRPT: నడిగూడెం మండల కేంద్రంలోని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యుడు జీ.శ్రీనివాస్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ, విద్యార్థులకు కల్పించిన వసతులను ఆయన పరిశీలించారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్‌కు తావులేకుండా నిబంధనల ప్రకారం పరీక్షలు సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.