KNR: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్లో మంగళవారం జరిగిన సమీక్షలో మాట్లాడుతూ.. 318 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 31 కేంద్రాలు ప్రారంభమయ్యా యని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలను వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.