NLG: గుర్రపోడు మండలం తెరాటిగూడెం గ్రామంలో మంగళవారం సాయంత్రం పిడుగు పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామ శివారులో ఉన్న తాటి చెట్లపై ఒక్కసారిగా పిడుగు పడటంతో చెట్లకు మంటలు అంటుకుని భారీగా పొగలు ఎగసిపడ్డాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సమీప ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.