KRNL: పెద్దకడబూరు మండలం కల్లుకుంట గ్రామంలోని ZPH పాఠశాలలో FAPTO ఆధ్వర్యంలో ఏప్రిల్ 25, 26, 27 తేదీలలో విజయవాడలో నిర్వహించనున్న రిలే నిరాహార దీక్షలను విజయవంతం చేయాలని కోరుతూ ఇవాళ ఉపాధ్యాయులు కరపత్రాలను విడుదల చేశారు. పాఠశాల హెచ్ఎం సుధాకర్ మాట్లాడుతూ.. ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న ఈ దీక్షలకు ప్రభుత్వం స్పందించాలన్నారు.