NDL: బనగానపల్లె మార్కెట్ యార్డు ఛైర్మన్ కాట్రెడ్డి మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభమయ్యాయి. కోయిలకుంట్ల గవర్నమెంట్ హైస్కూల్లో ముఖ్య అతిథిగా బీసీ ఇందిరమ్మ పాల్గొని ప్రారంభించారు. అనంతరం బాక్స్ క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించి, ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.