WNP: జిల్లాలో ఏప్రిల్ 26 వరకు ‘సంక్షేమ వారోత్సవాలు’ నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన ప్రభుత్వ వసతి గృహాలను సందర్శించి, పారిశుధ్యం, భోజన నాణ్యతను తనిఖీ చేయాలన్నారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.