బాలీవుడ్ నటి రాధికా ఆప్టే(39) సుమారు 12 ఏళ్ల తర్వాత తల్లి కాబోతుంది. ఈ మేరకు బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కెరీర్ పీక్‌స్టేజ్‌లో ఉన్న సమయంలో బ్రిటీష్ వయొలినిస్ట్ బెండిక్ట్ టేలర్‌ను ఆమె 2012లో పెళ్లి చేసుకుంది. ఆమెకు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా, రాధికా తెలుగులో రక్తచరిత్ర, రక్తచరిత్ర 2, లెజెండ్, లయన్, కబాలి వంటి మూవీల్లో నటించారు.