AP: తినడానికి తిండి లేదని ఎవరూ బాధపడొద్దని సీఎం చంద్రబాబు అన్నారు. అందుకే అన్న క్యాంటీన్లు ప్రారంభించామని తెలిపారు. ఇది కేవలం అన్నదానం కాదని.. పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరు శక్తి మేరకు అన్నదానం చేయాలి అని సూచించారు. ఇది ప్రజా ఉద్యమంగా సాగాలన్నారు. సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గాలని ఆకాంక్షించారు.