AKP: నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో అగ్నిమాపక భద్రత వారోత్సవాల్లో భాగంగా ఆదివారం అగ్నిప్రమాదాలు నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ అప్పలస్వామి ఆధ్వర్యంలో షార్ట్ సర్క్యూట్ జరిగితే ఎలా స్పందించాలనే అంశంపై వైద్య సిబ్బందికి డెమో రూపంలో వివరించారు. అనుకోని పరిస్థితులలో ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవిస్తే రోగులను రక్షించే విధానాన్ని పేర్కొన్నారు.