MDK: రోడ్డు నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని సీఐ వెంకటరాజు గౌడ్, ఎస్సై సృజన అన్నారు. వల్లభాపూర్లో నిర్వహించిన ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమంలో వారు మాట్లాడారు. మద్యం సేవించి వాహనం నడపవద్దని, సీటు బెల్ట్, హెల్మెట్ తప్పనిసరి అని వారు సూచించారు. సర్పంచ్ జగన్మోహన్ రెడ్డి 80 మందికి హెల్మెట్లు పంపిణీ చేయగా, కృష్ణారెడ్డి సీసీ కెమెరాలను అందజేశారు.