PPM: పార్వతీపురం మన్యం జిల్లాను విశాఖ ఎకనామిక్ కారిడార్లో కలపడం అత్యంత ఆనందదాయకమని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర హర్షం వ్యక్తం చేశారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. పార్వతీపురంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి రైతుల అభివృద్ధికి దోహదపడాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. పార్వతీపురంలో వ్యవసాయ ఉత్పత్తులకు అనేక అవకాశాలు ఉన్నాయన్నారు.