MDK: కౌడిపల్లి మండలం తునికి శ్రీనల్ల పోచమ్మ ఆలయంలో 3 రోజులపాటు నిర్వహించనున్న జాతర ఏర్పాట్లను జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పరిశీలించారు. జాతర రోజుల్లో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో కౌడిపల్లి ఎస్సై అమర్, ఆలయ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కలిసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు.