ASF: చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున 2 ట్రాక్టర్లు చోరీకి గురయ్యాయి. వాటర్ ప్లాంట్ వద్ద పార్కింగ్ చేసిన వాహనాలను దొంగలు ఎత్తుకెళ్లారు. అయితే ఆడేపల్లి సమీపంలోని ఫారెస్ట్ ఏరియాలో ఒక ట్రాక్టర్ గుంతలో ఇరుక్కుపోవడంతో దొంగలు అక్కడే వదిలేశారు. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.