TG: హైదరాబాద్లో 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై ఆర్థికశాఖ, CESS ఆధ్వర్యంలో కీలక సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎస్ రామకృష్ణారావుతో పాటు మాజీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా, ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తదితర ఆర్థికవేత్తలు పాల్గొన్నారు. కేంద్ర పన్నుల వాటా, రాష్ట్రాల కార్యాచరణ, అభివృద్ధి వ్యూహాలపై ఈ సదస్సులో లోతుగా చర్చించారు.