MHBD: తొర్రూరు మండలంలోని వెలికట్ట గ్రామ శివారు జాతీయ రహదారి వెంట ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఇటుక బట్టీలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు తొర్రూరు తహసీల్దార్ గడీల శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటుక బట్టీల నుంచి వెలువడే పొగ, ధూళి కారణంగా వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.