కోనసీమ: మండపేట పట్టణంలోని సైదల్లి పేట రైతు బజార్ రామాలయంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయస్వామి వారి విగ్రహ ప్రతిష్ట చేసి 41 రోజులు పూర్తి అయింది. ఈ సందర్భంగా గురువారం మండల పూజ నిర్వహించారు. ఈ మండల పూజలో రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.