NTR: తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను వీరులపాడు పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై అభిమన్యు ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో లారీలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ లారీలు ఒక ప్రముఖ కాంట్రాక్ట్ కంపెనీకి చెందినవిగా గుర్తించారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.