వేసవిలో పుచ్చకాయలు ఎర్రగా, ఆకర్షణీయంగా కనిపించడానికి కొందరు వ్యాపారులు రసాయన రంగులు ఉపయోగిస్తున్నారు. వీటిని గుర్తించడానికి పుచ్చకాయను రెండు భాగాలుగా కోయాలి తర్వాత ఒక తెల్లటి దూదితో రుద్దండి. దూదికి రంగు అంటితే అది కల్తీ అని అర్థం. ఇలాంటి పండ్లు తింటే కడుపునొప్పి, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. అందుకే రంగును చూసి మోసపోకుండా, సహజంగా ఉండే పండ్లనే ఎంచుకోవడం మంచిది.