HYD: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు మందకోడిగా సాగుతున్నాయని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. శనివారం పద్మారావు నగర్లో డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. 30 ఏళ్ల నుంచి ఉన్న ఇబ్బందులకు శాశ్వత విముక్తి లభించునుందని వెల్లడించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను పూర్తి చేయాలన్నారు.