NRPT: వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు గ్రామపంచాయతీ నుండి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఎలిగండ్ల సర్పంచ్ అశ్విని నరేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇవాళ చలివేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. స్థానిక చౌరస్తాలో చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు పాల్గొన్నారు.