Film Celebrities : స్టార్ హీరోలంతా మైత్రీలోనే.. లైనప్ అదిరింది!
Film Celebrities : ప్రస్తుతం టాలీవుడ్లో మైత్రీ మూవీ మేకర్స్ టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ ఏడాది ఆరంభంలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ కొట్టేసింది మైత్రీ సంస్థ. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ సంక్రాంతి విన్నర్స్‌గా నిలిచారు.
ప్రస్తుతం టాలీవుడ్లో మైత్రీ మూవీ మేకర్స్ టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ ఏడాది ఆరంభంలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ కొట్టేసింది మైత్రీ సంస్థ. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ సంక్రాంతి విన్నర్స్‌గా నిలిచారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డితో రెండు విజయాలను తమ ఖాతాలో వేసుకున్న మైత్రీ వారు.. తాజాగా కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ చిత్రంతో హ్యాట్రిక్ హిట్ కొట్టేశారు. దీంతో మైత్రీ వాళ్లు పట్టిందల్లా బంగారమే అవుతోంది. అంతేకాదు రాబోయే చిత్రాల లైనప్ చూస్తే.. ఇప్పట్లో మైత్రీ వారికి తిరుగులేదనిపిస్తోంది. టాలీవుడ్ బడా హీరోలంతా మైత్రీ బ్యానర్లోనే సినిమాలు చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మొదలుకొని.. కిరణ్ అబ్బవరం లాంటి వారితో మైత్రీ వారు సినిమాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో చేస్తున్న ‘ఖుషీ’, అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సెట్స్ పై ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్‌ను ఇప్పటికే గ్రాండ్‌గా లాంచ్ చేశారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఎన్టీఆర్ 31ను ఎప్పుడో అనౌన్స్ చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రకటించారు. ఈ సినిమాలు ఈ సంవత్సరంలోనే మొదలు కానున్నాయి. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో.. హృతిక్, ప్రభాస్‌తో ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్-ధనుష్ కాంబినేషన్ కోసం వెట్రిమారన్‌తో ట్రై చేస్తున్నారు. అలాగే మలయాళ హీరో టివినో థామస్‌తో ‘నడిగర్ తిలకం’ని నిర్మిస్తున్నారు. ఇవే కాదు.. నితిన్, కిరణ్ అబ్బరం లాంటి యంగ్ హీరోలతోను సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా ఇప్పుడు టాలీవుడ్లో మైత్రీ వాళ్ల హవా నడుస్తోందని చెప్పొచ్చు.