KMR: రామారెడ్డి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కృష్ణమూర్తి గుండెపోటుతో మరణించారు. గురువారం ఉదయం ఎప్పటిలాగే స్టేషన్లో విధులకు హాజరైన కృష్ణమూర్తికి హఠాత్తుగా గుండె నొప్పి వచ్చి కుప్పకూలిపోయారు. వెంటనే పోలీస్ సిబ్బంది ఆయణ్ను ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు, ఆయన అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.