US: పెన్సిల్వేనియాలో కొన్ని నెలల క్రితం ప్రచార సభలో అధ్యక్ష అభ్యర్థి ట్రంప్‌పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా అదే ప్రాంతంలో మరో సభలో పాల్గొనేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. ఈ సభలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పాల్గొననున్నారు. ఈ మేరకు తాను ట్రంప్‌కు మద్దతుగా అక్కడ ఉంటానని మస్క్ ట్వీట్ చేశారు. కాగా, నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.