AP: కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీమంత్రి, YCP నాయకురాలు విమర్శించారు. కూటమి నేతలు మహిళలను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గత ఐదేళ్లలో 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారని ఆరోపించిన పవన్ కళ్యాణ్.. అధికారంలోకి వచ్చాక ఎంతమందిని రక్షించారని నిలదీశారు. నాటి జగన్ ప్రభుత్వంపై బురద జల్లడానికే తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు.