RR: గుర్తుతెలియని యువకులు మాస్కులు ధరించి బైక్పై చక్కర్లు కొట్టిన ఘటన షాద్నగర్ పట్టణంలో చోటుచేసుకుంది. ప్యారడైస్ కాలనీలో ఓకే బైక్పై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంటి ముందు వాహనం ఆపి పరిశీలించారు. అనంతరం సీసీ కెమెరాలు పరిశీలించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. అర్ధరాత్రి సమయాల్లో పోలీసులు గస్తీ పెంచాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.