ASF: తెలంగాణ రాష్ట్ర సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మే 9వ తేదీన నిర్వహించాల్సిన జాతీయ లోక్ అదాలత్ ను జూన్ 20వ తేదీకి వాయిదా వేసినట్లు ఆసిఫాబాద్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. మే 7నుంచి జూన్ 5వరకు వేసవి సెలవుల నేపథ్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ తేదీని మార్చినట్లు పేర్కొన్నారు.