రామాయణంపై తన వ్యాఖ్యలకు నటుడు ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చాడు. ‘కేరళం లిటరరీ ఫెస్టివల్లో నేను మాట్లాడిన ప్రసంగంలోని కొన్ని మాటలను మాత్రమే తీసుకుని, కొందరు వక్రీకరించారు. శ్రీరాముడి గురించి తప్పుగా మాట్లాడానని, హిందువుల మనోభావాలను గాయపరిచానని అంటున్నారు. అన్ని ధర్మాలను, అందరినీ ప్రేమించే నాకు ఆ అవసరం లేదు. కొందరు నన్ను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరిస్తున్నారు’ అని మండిపడ్డారు.