మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు విద్యార్థులు, శిక్షకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు GM శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 27 నుంచి మే 21 వరకు పలు క్రీడల్లో శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. 18 ఏళ్లలోపు బాలబాలికలు తమ పేర్లు 26లోపు నమోదు చేయించుకోవాలని సూచించారు.