BHPL: రేగొండ మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణ పనులు శంకుస్థాపనకే పరిమితం అయ్యాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మూడు నెలల క్రితం మంత్రి, MLA గండ్ర శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు కూడా ఒక్క పని కూడా ప్రారంభించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి బస్టాండ్ నిర్మాణ పనులు చేపట్టాలని స్థానికులు కోరారు.