AP: అంగన్వాడీల బలోపేతానికి కృషి చేస్తున్నామని మంత్రి సంధ్యారాణి అన్నారు. అదేవిధంగా 7,000 ఆయా పోస్టులను భర్తీ చేయనున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. 55,746 అంగన్వాడీ కేంద్రాలు, 257 ఐసీడీఎస్ ప్రాజెక్టుల ద్వారా గర్భిణులు, బాలింతలు, 6 ఏళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అంగన్వాడీ సెంటర్లలో హాజరు శాతం 70 నుంచి 96 శాతానికి చేరిందన్నారు.