HNK: రోడ్డు ప్రమాదాల భారిన పడకుండా ఉండేందుకు సురక్షిత ప్రయాణం దిశగా రోడ్డు భద్రతా నియమాలను వాహనదారులు పాటించే విధంగా చేయడమే అరైవ్ అలైవ్ కార్యక్రమమని రాష్ట్ర అడిషనల్ డీజీపీ చారు సిన్హా అన్నారు. చింతగట్టులో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో CP సన్ ప్రీత్ సింగ్, కలెక్టర్లతో కలిసి అడిషనల్ డీజీపీ పాల్గొన్నారు.